జమ్మూని జల్లెడ పడుతున్న ఆర్మీ, ఆరు నెలల్లో 60 మందికి పైగా తీవ్రవాదులు హతం.. - Narada News Telugu

Kalahamsa
0

జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత ముమ్మరంగా సాగుతోంది. ఈ ఏడాది ప్రారంభం నుండి 6 నెలల్లో మొత్తం 61 మంది తీవ్రవాదులను మట్టుబెట్టినట్లు ఆర్మీ ప్రతినిధి తెలిపారు. మిలిటెంట్ల కట్టడి ఆపరేషన్లు కొనసాగుతాయని స్పష్టం చేశారు. కరోనా మహమ్మారి కట్టడికి విధించిన లాక్డౌన్తో ఉగ్రమూకల నిర్మూలన ఆపరేషన్లు కాస్త తగ్గినట్లు ఇటీవల వెల్లడించారు. జమ్ముకశ్మీర్ పోలీస్ చీఫ్ దిల్బాగ్ సింగ్ మాట్లాడుతూ…

“కరోనా లాక్డౌన్తో ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్లు కాస్త తగ్గాయి. భద్రతా బలగాలు, ముఖ్యంగా పోలీసు, పారామిలిటరీ దళాలు లాక్డౌన్ విధులు నిర్వర్తించటం ద్వారా టెరరిస్టుల వ్యతిరేక ఆపరేషన్లు గతంతో పోలిస్తే.. తగ్గాయి. జమ్ముకశ్మీర్లో ఈ ఏడాది జరిగిన వివిధ ఘర్షణల్లో 61 మంది ముష్కరులను బలగాలు మట్టుబెట్టాయి. అయితే.. గత నెలలో లాక్డౌన్ ఆంక్షలు సడలించిన క్రమంలో ఉగ్రవాదుల ఏరివేతను బలగాలు ముమ్మరం చేశాయని పేర్కొన్నారు.

శ్రీనగర్ మలురా ప్రాంతంలో ఇటీవల ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టాయి బలగాలు. కుల్గాంలో రెండు రోజుల క్రితం ముగ్గురిని హతమార్చాయి.

Tags

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top