మానవహక్కుల ఉద్యమకారుల ముసుగులో.. మతోన్మాదుల వారసుడు ఈ స్థాన్ స్వామి. - Narada News Telugu

Kalahamsa
0

ఫాదర్ స్టాన్ స్వామి మతనేపథ్యం

భీమా-కోరేగావ్ అల్లర్ల కేసులో అరెస్ట్ అయి జైల్లో మరణించిన స్టాన్ స్వామి పూర్తి పేరును, అతని క్రైస్తవ మత నేపథ్యాన్ని మీడియా సంస్థలు ఉద్దేశ్యపూర్వకంగా దాచిపెడుతున్నాయి. తమిళనాడులో తిరుచురాపల్లికి చెందిన ఆయన పూర్తి పేరు ఫాదర్ స్టానిస్లేయస్ లూర్ధుస్వామి. ఈయన ఒక క్రైస్తవ ప్రీస్ట్ ఇంకా అడ్వకేట్. తన క్రైస్తవ మతనేపథ్యం గురించి చెప్పకుండా ఆయనను గిరిజన-మానవహక్కుల పోరాట యోధుడిగా కాంగ్రెస్, కమ్యూనిస్టు-మావోయిస్టు అనుకూల మీడియా చిత్రిస్తోంది. స్టాన్ స్వామి కేవలం చర్చి ఫాదర్, హక్కులనేత, అడ్వకేట్ అయితే మనం పెద్దగా పట్టించుకోవాల్సిన పనేముంది? కానీ అతడు “జెస్యూట్ ఆర్డర్” అనే క్రైస్తవ మతోన్మాద సంస్థ సభ్యుడు కూడా. ఈ జెస్యూట్ ఆర్డర్ సంస్థ క్రైస్తవ మతవ్యాప్తి కోసం గత నాలుగువందల ఎనభై సంవత్సరాల కాలంలో భారతదేశంతో సహా ప్రపంచమంతా రక్తపుటేర్లు పారించి ప్రతి దేశంలోనూ వేలాదిమందిని పొట్టనపెట్టుకుంది.
 
జెస్యూట్లు అడుగు పెట్టిన ప్రతిచోటా స్థానిక భాషలు, సంస్కృతులు, మతాలు అణిచివేతకు గురై క్రైస్తవమతం వృద్ధి చెందింది. జెస్యూట్ ఆర్డర్ కు జీసస్ సొసైటీ, సొసైటీ ఆఫ్ జీసస్ అనే పేర్లు కూడా ఉన్నాయి. 1540 లో ఇగ్నేషియస్ ఆఫ్ లయోలా అనే మాజీ సైనికుడు మరో ఆరుగురితో కలిసి పోప్ పాల్-3 అనుమతితో ఇటలీలోని రోమ్ నగరంలో ఉన్న కాథలిక్ చర్చి ప్రధాన కేంద్రంగా జెస్యూట్ ఆర్డర్ ను స్థాపించాడు. ఇగ్నేషియస్ ఆఫ్ లయోలా తరువాత కాలంలో సెయింట్ హోదా పొందాడు. జెస్యూట్లు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లి ఎటువంటి దుర్భర పరిస్థితుల్లో అయినా సరే జీవిస్తూ క్రీస్తుపై విశ్వాసాన్ని రక్షించడం కోసం పనిచేసే దేవుని సైనికులుగా, దేవుని నావికులుగా ప్రసిద్ధి చెందారు. ఈరోజు ఈ సంస్థ 112 దేశాల్లో క్రైస్తవ మతవ్యాప్తి కోసం విద్య, వైద్య, పరిశోధన, సామాజిక అంశాల ఆధారంగా పని చేస్తోంది. 2020 నాటి సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 15,306 మంది జెస్యూట్లు ఉన్నారు.

వారిలో మొన్న జైల్లో మరణించిన ఫాదర్ స్టాన్ స్వామి ఒకడు. ఈయన మృతికి జెస్యూట్ ఆర్డర్ తమ అధికార వెబ్సైట్ లో నివాళులు కూడా తెలిపింది. పాశ్చాత్యదేశాల సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నామని డప్పులు కొట్టుకునే ఎర్రజండాలు అదే పాశ్చాత్యదేశాలకు అనుకూలంగా ఉండే జెస్యూట్ ఆర్డర్ సభ్యుడైన స్టాన్ స్వామిని ఎందుకు మోస్తున్నాయి? ఆయన చనిపోయేదాకా అతనెవరో పెద్దగా ఎవరికీ తెలియదు కదా? దీనికి కాంగ్రెస్-కమ్యూనిస్టు, మావోయిస్టు-మిషనరీల మధ్య భారతదేశానికి, మోడీకి వ్యతిరేకంగా పైకి కనబడని అక్రమసంబంధం ఉంది కాబట్టి అని సమాధానం చెప్పొచ్చు. మావోయిస్టు సానుభూతి పరుడిగా కమ్యూనిస్టు మీడియా ప్రచారం చేస్తున్న స్టాన్ స్వామి మృతికి ఇటలీలో రోమ్ ప్రధానకేంద్రంగా ఉన్న క్రైస్తవ సంస్థ జెస్యూట్ ఆర్డర్ అర్పించిన నివాళులు ఆ సంస్థ అధికార వెబ్సైట్లోకి వెల్లి చూస్తే తెలుస్తుంది.


Tags

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top