యూపీ జిల్లా పంచాయితీ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం. - Narada News Telugu

Kalahamsa
0
లక్నో : జిల్లా పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ విజయ దుందుభి మోగించింది. మొత్తం 75 సీట్లలో ఎన్నికలు జరగ్గా, ఏకంగా 67 సీట్లలో విజయ కేతనం ఎగరవేసింది. గతంలో ఏకంగా 63 సీట్లు సాధించి సమాజ్‌వాదీ పార్టీ రికార్డుల్లోకెక్కింది. తాజాగా బీజేపీ... ఈ రికార్డును బద్దలు కొట్టింది. ఏకంగా 67 స్థానాల్లో విజయ దుందుభి మోగించింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కంచుకోటగా ఉన్న రాయ్‌బరేలీలో కూడా బీజేపీ జెండా ఎగరేయడం విశేషం. మరి కొన్ని రోజుల్లోగా యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో తాజా ఫలితాలు ఊపునిచ్చాయని నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫలితాలపై డిప్యూటీ సీఎం కేశవ ప్రసాద్ మౌర్య స్పందిస్తూ... ‘‘వచ్చే ఎన్నికల్లోనూ అధికారం మనదే... మనస్ఫూర్తిగా అనుకోండి’’ అంటూ మౌర్య ట్వీట్ చేశారు. 
Tags

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top